హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22లోగా స్మార్ట్ కిచెన్ల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

KDP: జిల్లాలో 38 స్మార్ట్ కిచెన్ల ద్వారా లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా పెండింగ్ పనులను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నిర్ణీత సమయానికి వేడివేడి, నాణ్యమైన ఆహారం అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ ఆదేశాలు జారీ చేశారు.