హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటమి భయంతోనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు'

VZM: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే భయభ్రాంతులకు కూటమినేతలు పాల్పడుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం గజపతినగరంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించారని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. అన్ని స్థానాలలో వైసీపీ పోటీ చేస్తుందన్నారు.