హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి నుంచి టీడీపీలో చేరిన 200 కుటుంబాలు

SKLM: టెక్కలి పట్టణంలోని గొల్ల వీధికి చెందిన సుమారు 200 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. శనివారం మంత్రి అచ్చెన్నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.