హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కెనడాలో ప్రేమ.. నేపాల్‌లో పెళ్లి

GNTR: కెనడాలో చిగురించిన ప్రేమ సరిహద్దులు దాటి పెళ్లికి దారితీసింది. గుంటూరుకు చెందిన తుమ్మల ప్రవీణ్ కుమార్, నేపాల్‌కు చెందిన బాన్నెట్ రజిత కెనడాలో ఉద్యోగం చేస్తూ ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో నేపాల్‌లోని జాపాలో హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. గుంటూరు నుంచి బంధువులు అక్షింతలు, మంగళసూత్రం పంపి నూతన దంపతులను ఆశీర్వదించారు.