హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలిసొచ్చిన ఎన్నికలు...రూ.4.40 లక్షల పన్నులు చెల్లింపు

E.G: నిడదవోలు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు, ఆశావహులు తమ ఇంటి పన్నులు చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయానికి క్యూ కట్టారు. మున్సిపల్ బోర్డు పదవులకు పోటీ చేయాలంటే బకాయిలు లేవని నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి. దీంతో గత మూడు రోజుల్లో 93 మంది అభ్యర్థులు రూ.4.40 లక్షల పన్నులు చెల్లించారని రెవెన్యూ అధికారి ఎం.నాగకుమారి తెలిపారు.