హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్ది ఆలయ ఆదాయం ఎంతంటే?

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఉదయం 8 గంటలకు ముఖమండపంలో పంచామృతాభిషేకం నిర్వహించారు. అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల ద్వారా రూ.2,50,153 ఆదాయం లభించింది. 5,276 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.