హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోడ్డు విస్తరణ పేరుతో కార్యాలయాన్ని కూల్చొద్దు'

BHPL: భూపాలపల్లిలో రోడ్డు విస్తరణ పేరుతో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని కూల్చే ప్రయత్నాలను విరమించుకోవాలని MRPS రాష్ట్ర నాయకుడు అంబాల చంద్రమౌళి డిమాండ్ చేశారు. 200 అడుగుల రోడ్డు అవసరంపై పునరాలోచించి, కార్మిక సంఘాల కార్యాలయాలను కాపాడాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో MRPS, MSP నాయకులు పాల్గొన్నారు.