హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో టీడీపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిక

బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ 11వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ మల్లెల లలిత రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పందిళ్లపల్లిలోని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆమంచి కృష్ణమోహన్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. లలిత రాజశేఖర్‌తో పాటు మరికొంత మంది టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరిక స్థానిక రాజకీయ చర్చనియంగా మారింది.