హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి జంగారెడ్డిగూడెం ఛైర్మన్ అభ్యర్థి ఎవరంటే?

ELR: జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా కూటమి తరఫున టీడీపీ నుంచి రొంగల అనూషను పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఆమె రేపు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలు తెలిపారు.