హైదరాబాద్: 28°C
వార్తలు

సీఈసీ రాజీనామా కోరుతూ లండన్ SFI నిరసన

లండన్‌లోని భారత హైకమిషన్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. SFI UK ఆధ్వర్యంలో స్టాండ్ ఇన్ సాలిడారిటీ పేరుతో ఆందోళన చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని, SIR ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ పతాకం, SFI జెండాలతో ఈ నిరసనలో పాల్గొని.. జై భీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం సారే జహసె అచ్చా.. అంటూ దేశభక్తి గేయాన్ని పాడారు.