హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి'

ELR: స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం జరిగింది. నామినేషన్ల పరిశీలన నుంచి ఫలితాల ప్రకటన వరకు నిబంధనలు పాటించాలని, బ్యాలెట్ బాక్సుల నాణ్యతను సరిచూసుకోవాలని సూచించారు.