హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను సందర్శించిన అడిషనల్ ఎస్పీ

పల్నాడు జిల్లా పరిధిలోని పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి సందర్శించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి ఆదేశించారు.