హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్

PPM: పాలకొండ పురపాలక సంఘం (మున్సిపాలిటీ) కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగనాధ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ​అనంతరం ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.