హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు ఐక్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

KRNL: హోళగుందలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి శనివారం పర్యటించారు. ఆయనకు వైసీపీ నాయకులు పూలమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో స్థానిక పరిస్థితులు, అభ్యర్థుల బలాబలాలను పరిశీలించి ఎంపిక చేయాలని ఎమ్మెల్యే సూచించారు. విభేదాలు పక్కనపెట్టి ఐక్యంగా పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని MLA పిలుపునిచ్చారు.