హైదరాబాద్: 28°C
వార్తలు

యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి వారెంట్

యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2018లో వికాస్ సంస్కృతియాన్ అనే వ్యక్తిపై ధ్రువ్ రాఠీ పోస్ట్ చేసిన 'బీజేపీ ఐటీ సెల్ పార్ట్ II' వీడియో పరువునష్టం కలిగించేలా ఉందంటూ ఈ కేసు నమోదైంది. గతంలో జారీ చేసిన సమన్లను అందించేందుకు వెళ్లగా ఆయన ఇల్లు తాళం వేసి ఉండటంతో, కోర్టు తాజాగా ఈ వారెంట్ జారీ చేసి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.