హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లకు పటిష్ట పోలీసు బందోబస్తు

నంద్యాలలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో 80 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ సుస్మిత తెలిపారు. అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. మిగిలిన వారిని 100 మీటర్ల దూరంలోనే నిలువరిస్తామని పేర్కొన్నారు. క్యూఆర్‌టీ, స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.