హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తపల్లిలో ఉపాధి హామీ పనుల పరిశీలన

MDK: పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో సాగుతున్న వీబీ-జీ రామ్‌జీ ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రత్యక్షంగా పరిశీలించారు. డీఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్, గ్రామ సర్పంచ్‌లతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లిన కలెక్టర్, పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ.. లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.