హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్షనపల్లిలో భూ సర్వే పనుల పరిశీలన

WGL: నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను తహసీల్దార్ ముప్పు కృష్ణ పర్యవేక్షించారు. సర్వే బృందంతో కలిసి భూ హద్దులను పరిశీలించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు సర్వే బృందానికి సహకరించాలని కోరారు.