SRD:సిర్గాపూర్ మండలం కడ్పల్ విఠల్ నాయక్ తండాలో మహిళా సంఘ భవన నిర్మాణానికి ఇవాళ భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దూరి భాయ్ విఠల్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళల అభివృద్ధి, సమావేశాల నిర్వహణ కోసం భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళా సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ


