హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడో రోజు సరస్వతీ దేవిగా అమ్మవారి దర్శనం

JN: వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.