హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ

NRML: ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలోని ఓంకారేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాన్ని భక్తులు కరెన్సీ నోట్లతో అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కుల్లో భాగంగా నోట్ల దండలను సమర్పించి తోరణాలుగా అలంకరించారు. రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500 నోట్లతో మొత్తం రూ.11,11,111 విలువైన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.