MHBD: దంతాలపల్లి బస్టాండ్ అధ్వానంగా తయారైంది. కూర్చునేందుకు బెంచీలు లేక, ఆవరణమంతా చెత్తాచెదారం, పందులు, కుక్కలతో నిండిపోయింది. మరుగుదొడ్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి నిరుపయోగంగా మారాయి. రాత్రివేళ లైట్లు లేక కటిక చీకటితో ప్రయాణికులు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కనీస వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
పేరుకే బస్టాప్.. సౌకర్యాలు మాత్రం నిల్!


