హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్వతీపురం పురపాలక సంఘ ఏపీఓలకు 23న శిక్షణ'

మన్యం: పార్వతీపురం పురపాలక సంఘ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు (ఏపీఓ) ఈ నెల 23న ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. రాంగోపాల్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్వతీపురంలోని లైన్స్ కళ్యాణ మండపంలో శిక్షణ ఉంటుందన్నారు.