హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరాకి ఊరికి వెళ్తున్నారా.. ఎస్సై సూచన

BHNG: దసరా సెలవులకు ఊర్లకు వెళ్లే వారికి మోత్కూర్ ఎస్సై కొంపెల్లి సతీష్ పలు సూచనలు చేశారు. విలువైన వస్తువులని తమతో తీసుకెళ్లాలని డబ్బులు, బంగారం బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లే వారు ఇంటి పక్కన వారికి సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటి చుట్టూ లైట్లు వేసి ఉంచాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే 112 కాల్ చేయాలన్నారు.