హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన యువతకు సౌకర్యాలు కల్పించాలని వినతి

MHBD: గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేష్ నాయక్ కోరారు. ఈ మేరకు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. శిక్షణ కేంద్రాల్లో వసతులు పెంచి మరింత మంది గిరిజన యువతకు ప్రయోజనం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.