VSP: గ్రేటర్ విశాఖ ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తండ్రీకూతురు ఎన్నికల పోటీకి సిద్ధమయ్యా రు. మధురవాడ పరిధిలోని ఆరో వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోతిన హనుమంతరావు, ఏడో వార్డు నుంచి ఆయన కుమార్తె పోతిన జాహ్నవి బరిలోకి దిగారు. నామినేషన్ల దాఖలుకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో తండ్రీకూతురు పోటీ


