హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు

WG: నరసాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరడాన్ని నిషేధిస్తూ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఈ.నాగార్జున ఉత్తర్వులిచ్చారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద శనివారం నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని టౌన్ సీఐ అకుల రఘు హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.