హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రేటర్‌ హైదరాబాద్‌లో డెంగ్యూ కలకలం

HYD: గ్రేటర్‌ హైదరాబాద్‌లో 297కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గతంలో అధిక కేసులు నమోదైన ప్రాంతాలను జీఐఎస్‌ సాంకేతికతతో గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టి, ఫాగింగ్‌, దోమల లార్వా నివారణ చర్యలు పెంచాలని అన్నారు. ప్రతి శుక్రవారం ఇళ్లు, కార్యాలయాల్లో డ్రైడే పాటించి, మురుగు కాల్వలు, చెరువుల వద్ద నివారణ మందులు పిచికారీ చేయాలన్నారు.