హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోపాలపట్నంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

VSP: గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్‌లో ఇవాళ ఉదయం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సీఐ ఎల్.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో ఎస్సైలు, సిబ్బంది వంద ఇళ్లతో పాటు స్థానిక వాహనాల రికార్డులను పరిశీలించి, సరైన పత్రాలు లేని ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానితులు సంచరిస్తే వెంటనే సమచారం ఇవ్వాలన్నారు.