SKLM: ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో దుర్గా మహేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రధానార్చకులు కాశీభట్ల మురళీ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కుంకుమ పూజలు జరిగాయి. 1000 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ


