హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ క్రికెట్ పోటీలకు తాపీ మేస్త్రి కూతురు

SRPT: పేదరికాన్ని అధిగమించి మామిడి పల్లవి జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైంది. జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పల్లవి ఓ క్రికెట్ అకాడమీలో ఉచిత శిక్షణ పొందుతోంది. త్వరలో జమ్మూకశ్మీర్లో జరిగే పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనుంది. తాపీ మేస్త్రి అయిన తండ్రి రామకృష్ణ కుమార్తె విజయంపై హర్షం వ్యక్తం చేశారు.