హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఎస్‌ఐల బదిలీలు..!

నల్గొండ: జిల్లా పోలీస్ శాఖలో పలువురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఈరోజు జారీ అయ్యాయి. వాడపల్లి ఎస్‌ఐగా ఎన్. ధర్మా నియమితులు కాగా, అక్కడ అటాచ్‌మెంట్‌పై విధులు నిర్వహిస్తున్న సైదులును వీఆర్‌కు కేటాయించారు. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐగా యు. నగేష్ బాధ్యతలు చేపట్టనుండగా, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న లక్ష్మయ్యను వీఆర్‌కు బదిలీ చేశారు.