హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థిపై ఉత్కంఠ

కృష్ణా: మచిలీపట్నం మేయర్ పదవికి కూటమి అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి విడుదల చేసిన తొలి జాబితాలో మచిలీపట్నం అభ్యర్థి పేరు లేకపోవడంతో ఆసక్తి పెరిగింది. మేయర్ రేసులో కొనకళ్ల నారాయణరావు కోడలు గౌతమితో పాటు పల్లపాటి సుబ్రహ్మణ్యం, హసీమ్ బేగ్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండో జాబితా ఉండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.