హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్, ఆటో ఢీ.. వ్యక్తి మృతి

PLD: మాచర్ల(M)లో మండాది–బోధలవీడు గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో హనుమాపురం తండాకు చెందిన తులసి నాయక్(35) మృతి చెందాడు. మాచర్ల నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో హనుమాపురం తండాలో విషాదం నెలకొంది.