CTR: యాదమరి మండలం చిన్నంపల్లె గ్రామానికి చెందిన మధుమూర్తి అనే వ్యక్తి ఇవాళ ఉదయం ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని చిత్తూరు - గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిపై బీర్ బాటిల్తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానిక పోలీసులు అంబులెన్స్లో అతన్ని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్
యాదమరిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం


