KRNL: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై పుంగనూరులో జరిగిన దాడిని మాజీ ఎంపీ బుట్టా రేణుక తీవ్రంగా ఖండించారు. ఆయనపై జరిగిన దాడి హేయమైన చర్య అని ఆమె అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
మిథున్ రెడ్డిపై దాడి హేయమైన చర్య: బుట్టా రేణుక


