హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.6.50 లక్షలతో అమ్మవారికి అలంకరణ

కోనసీమ: మామిడికుదురు మండలం పాశర్లపూడిలంకలో శ్రీ నవ బాల కనకదుర్గ అమ్మవారిని శనివారం మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని రూ.6,50,001 విలువైన కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు.