SS: జిల్లాలో గత 24 గంటల్లో సగటున 14.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 32 మండలాలకుగానూ 30 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నల్లచెరువు మండలంలో 55.2 మిల్లీమీటర్లు, తలపులలో 37.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జిల్లా మొత్తం 473.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో 473.2 మి.మీ వర్షపాతం


