హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చికెన్ షాపు ఘటనపై ఎంపీ అవినాశ్ ఫైర్

KDP: పులివెందులలో రాఘవేంద్ర చికెన్ షాపును టీడీపీ నాయకులే తగలబెట్టారని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఉదయం దగ్దమైన చికెన్ షాపును ఆయన పరిశీలించారు. టీడీపీ నాయకులు అక్కుల గారి విజయ్ కుమార్ రెడ్డి, కిరికిరి భాషాలు వచ్చి తగలబెట్టడం దుర్మార్గమని పేర్కొన్నారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార పార్టీ ఆగడాలకు పాల్పడుతోందని విమర్శించారు.