హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరు రిజర్వాయర్‌కు నిలిచిన వరద ప్రవాహం

SRCL: బోయిన్‌పల్లి మండలం మాన్వాడలోని మిడ్ మానేరు రిజర్వాయర్‌కు వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. శనివారం ఉదయం నీటిమట్టం 316.32 మీటర్లుగా నమోదైంది. 27.55 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 23.391 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తిస్థాయి నిల్వకు మరో 4.16 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం ఇన్‌ఫ్లో సున్నాగా నమోదైంది.