TG: హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డబుల్ డెక్కర్ బస్సులు నెల రోజులుగా రోడ్డెక్కడం లేదు. పండుగ సెలవుల నేపథ్యంలో నగరాన్ని చూసేందుకు వస్తున్న పర్యాటకులకు ఇది తీవ్ర నిరాశ కలిగిస్తోంది. HMDA నుంచి నిర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖ స్వీకరించినప్పటికీ, వాటిని నడపడంలో విఫలమైంది. దీంతో అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ బస్సు సర్వీసులు ప్రస్తుతం షెడ్డుకే పరిమితమయ్యాయి.
వార్తలు
నగరంలో డబుల్ డెక్కర్ బస్సులకు బ్రేక్


