AP: ఆక్వా రైతులకు భారీ షాక్ తగిలింది. రొయ్యల మేత ధరలు భారీగా పెరిగాయి. వనామీ మేత కిలోపై రూ.9.35, టైగర్ మేత కిలోపై రూ.12.87 చొప్పున ధరలు పెరిగాయి. దీంతో వనామీ మేత టన్ను ధర రూ.1.20 లక్షలకు, టైగర్ మేత టన్ను ధర రూ.1.38 లక్షలకు చేరింది. కొత్త ధరలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. మేత ధరల పెంపుతో అదనపు భారం పడనుండటంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.
వార్తలు
ఆక్వా రైతులకు భారీ షాక్


