హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో టీడీపీ అభ్యర్థి ఎవరంటే..?

KDP: పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా టీడీపీ గీతా కుమారిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఆమె భర్త తూగుట్ల మధుసూదన్ రెడ్డి గతంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఇంటర్ చదివిన గీతా కుమారి తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ బరిలో ఉన్నారు. వైసీపీకి పట్టున్న పులివెందులలో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.