PLD: రొంపిచర్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి. 7వ రోజు శనివారం అమ్మవారు మహేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేములరావు శర్మ ఆధ్వర్యంలో ఉదయం కుంకుమ పూజలు, అలంకార దర్శనం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
మహేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు


