హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నాయుడుపేట మున్సిపల్ పీఠంపై నారీ సమరం'

TPT: నాయుడుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠం కోసం హోరాహోరీ నారీ సమరం మొదలైంది. టీడీపీ తరఫున 786 రఫీ సతీమణి షకీలా, వైసీపీ నుంచి తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి సతీమణి రాజేశ్వరమ్మల పేర్లను అధిష్టానాలు ఖరారు చేశాయి. 32 వార్డుల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నాయుడుపేటలో పసుపు జెండా ఎగురుతుందా? ఫ్యాన్ గాలి వీస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.