హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రంప్ నిర్ణయం.. భారత్, చైనాకు ఊరట

రష్యా ఎగుమతులతో ముడిపడి ఉన్న పలు ఆంక్షలు, సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో భారత్, చైనాకు ఊరట లభించింది. అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈనెల 18 గడువుకు ఒక్కరోజు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే భవిష్యత్తులో వీటిని మళ్లీ అమలు చేసే అధికారం ట్రంప్‌కు ఉంటుంది.