హైదరాబాద్: 28°C
వార్తలు

మళ్లీ తెరపైకి డీలిమిటేషన్!

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్‌సభ సీట్లను 50% పెంచడంతో పాటు, 33% మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ నెలాఖరులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి బిల్లుల ఆమోదానికి అవసరమైన 2/3 వంతు మెజారిటీ సాధిస్తామన్న ధీమాతో ప్రభుత్వం ఉండగా, విపక్షాలు మాత్రం అఖిలపక్ష భేటీకి పట్టుబడుతున్నాయి.