హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మురికిపూడిలో అక్రమ మద్యం పట్టివేత

PLD:​ చిలకలూరిపేట రూరల్ పరిధిలోని మురికిపూడిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న చెంబేటి రేణుకను శుక్రవారం రాత్రి ఎస్ఐ జి. అనిల్ కుమార్ పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి అధిక ధరలకు అమ్మేందుకు సిద్ధం చేసిన 180 ఎంఎల్ పరిమాణం గల 25 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.