హైదరాబాద్: 28°C
వార్తలు

ఆస్పత్రిలో చేరిన ఎల్‌కే అద్వానీ

బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ(98) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా రాత్రి 7.30 గంటల సమయంలో ఆయనను న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పల్మనరీ విభాగంలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈనెల 7న ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే.