హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు టీచర్ల నిరాహార దీక్ష

TG: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో ఉపాధ్యాయుల సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. STFI పిలుపు మేరకు ఈ దీక్ష చేయనున్నట్లు TSUTF రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌ చెప్పారు. ప్రభుత్వాల తీరును ఎలుగెత్తి చాటేందుకు ఈ ఆందోళన చేపడుతున్నట్లు వారు వెల్లడించారు.